VSP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలోని ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ ఆదేశాలు జారీచేశారు.