KRNL: క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని మంత్రాలయం పట్టణ టీడీపీ అధ్యక్షుడు వరదరాజు పిలుపునిచ్చారు. గ్రామదేవతల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టు ప్రథమ స్థానంలో, కర్ణాటకకు చెందిన గిల్కె సుగుర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు ఆయన ట్రోఫీలు, బహుమతులు అందజేశారు.