కృష్ణా: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. పేదలు ఇల్లు కట్టుకుంటే కఠినంగా వ్యవహరించే సీఆర్డీఏ అధికారులు, ధనికుల అక్రమ కట్టడాలపై మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విమాన భద్రతకు ముప్పు ఉన్నా, మామూళ్ల కారణంగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.