కృష్ణా: పెనమలూరు పరిధిలోని గణపతి నగర్, పెద్దపులిపాకలో ఎస్సై బీ. ప్రసాద్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. పోలీసులను చూసి తప్పించుకోబోయిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.250 కిలోల గంజాయి, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.