VSP: విశాఖ స్టీల్ ప్లాంట్ అదనపు ఇంఛార్జిగా సీఎండీగా మనీష్ రాజ్ గుప్తాను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సేల్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుత సీఎండీ అతుల్ భట్ పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘ నేతలు హర్షం వ్యక్తం చేసి, కొత్త నాయకత్వంలో ప్లాంట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.