KRNL: ఆదోనిలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి గురువారం పాల్గొన్నారు. గర్భిణులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. రెఫర్ కేసులను తగ్గించి, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.