కృష్ణా: యూనివర్సిటీ(KRU) పరిధిలో ఈ నెల 27న జరగాల్సిన పీజీ (LLM) మూడో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఈ నెల 27న జరగాల్సిన LLM మూడో సెమిస్టర్ పరీక్షను ఈ నెల 31న నిర్వహిస్తామని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ పీ. వీరబ్రహ్మచారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.