GNTR: ఈవ్ టీజింగ్, బైక్ రేసింగ్ అరికట్టేందుకు పోలీస్ శాఖ బుధవారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. పలు స్టేషన్ల పరిధిలో ఈవ్ టీజింగ్కి పాల్పడుతున్న 260 మంది, బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్కి పాల్పడుతున్న 214 మందిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.