TG: BJP రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అటు BJP ఆఫీస్‌కి వెళ్లే అన్ని దారులనూ పోలీసులు మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు వస్తే ఊరుకునేది లేదంటూ BJP శ్రేణులు వార్నింగ్ ఇచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, BJP కార్యాలయాల వద్ద దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.