ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్ SBI బ్యాంకు సమీపంలో ఇవాళ కోతుల దాడిలో బాలుడికి గాయాలయ్యాయి. గిద్దలూరు పట్టణానికి చెందిన మల్లేష్ అనే యువకుడిపై అకస్మాత్తుగా కోతులు దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.