‘అవతార్’ ఫ్రాంఛైజీ నుంచి రాబోతున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీ రేపు విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.3000 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.