KMR: గ్రామ పంచాయతీ ఎన్నికలు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పర్యవేక్షణలో సజావుగా ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలకు కేటాయించిన సాధారణ పరిశీలకుడు సత్యనారాయణరెడ్డిని కలెక్టర్ తన ఛాంబర్లో శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడంతో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించినట్లుగా కలెక్టర్ తెలిపారు.