NZB: నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి, బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.