భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) డేటా బేస్ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. అధునాతన భద్రతా చర్యల కారణంగా పౌరుల ఆధార్ డేటా సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.