NLR: విడవలూరు మండలంలోని ఊటుకూరు, రామతీర్థం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేరుశనగ పంటలో రక్షక పంటలు అయినటువంటి సజ్జలు, ట్రాప్ క్రాప్ అయినటువంటి ఆముదం గింజలను రైతులకు పంపిణీ చేశారు. ప్రతి రైతు వాటిని వేరుశనగ పంటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అనిత, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.