W.G: పాలకొల్లు శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇవాళ యాళ్లవానిగరువు, అడవిపాలెం గ్రామాల్లో ‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్’పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి కుటుంబం ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి గ్రామస్థులకు వివరించారు.