JN: కొడకండ్ల మండల పరిధి ఏడు నూతల సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి మురారి శెట్టి ఉమా విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన తన సమీప అభ్యర్థిపై 550 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన విజయానికి కారణమైన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఏడు నూతల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఉమా పేర్కొన్నారు.