MDK: కొల్చారం మండలం రాంపూర్ గ్రామం సర్పంచ్ గా నెల్లి రాజు ఘన విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నెల్లి రాజు తన సమీప అభ్యర్థిపై 242 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో సర్పంచ్ నెల్లి రాజు మద్దతుదారులు గ్రామంలో సంబరాలు నిర్వహిస్తున్నారు.