SRPT: HNR సర్కిల్ పరిధిలో ఈనెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 114 గ్రామపంచాయతీల్లో 18 ఏకగ్రీవమవ్వగా, మిగిలిన 96 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐజీ. చరమందరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 46 మందిపై కేసులు నమోదు చేసి 409 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.