ATP: గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన ఇడ్లీల తోపుడు బండ్లకు మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తోపుడు బండ్లు మొత్తం మంటల్లో ఖాళీ బూడిదయ్యాయి. సుమారు రూ.50 వేల దాకా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.