AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతం చలి గుప్పిట్లో చిక్కుకుంది. మినుములూరు 6, అరకు 6, పాడేరు 8, చింతపల్లిలో 10.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. మరోవైపు కనువిందు చేసే ప్రకృతి పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. మాడగడ, మేఘాలకొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది.