SDPT: దుబ్బాక పట్టణంలోని ప్రముఖ పోచమ్మ దేవాలయ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య చొరవతో సురేష్ రెడ్డి నిధుల నుంచి ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. మంజూరు పత్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు అందజేశారు.