VSP: విశాఖ 48వ వార్డు పరిధిలోని శ్రీనివాస్ నగర్, న్యూ శ్రీనివాస్ నగర్ కొండవాలు ప్రాంతాల్లో బుధవారం వార్డు కార్పొరేటర్, బీజేపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యుత్, పారిశుధ్యం, 24/7 మంచినీటి సరఫరా, నూతన కాలువల నిర్మాణం వంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.