NGKL: కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామంలోని చెరువు నీటిని యాసంగి పంట కోసం నూతన సర్పంచ్ జోగు రమణమ్మ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాగునీటిని వదలడంతో, సుమారు 200 ఎకరాల పొలాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భీమయ్య, మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, రైతులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.