ప్రకాశం: నరసాపురం అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ పెన్షనర్ల దినోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సబ్ ట్రెజరీ అధికారి పి. లలితకుమారి, డీఎస్ నకారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ నాయకులు ఎం. మార్కండేయులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పెన్షనర్ల సమస్యలు, హక్కులపై చర్చించారు.