TG: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మధ్య ఒక్క ఓటు వివాదం రాజుకుంది. దీంతో ప్రజలు స్కూల్ గేటు బద్దలుకొట్టుకుని లోనికి వచ్చారు. దీంతో అధికారులంతా ఒక రూమ్‌లోకి వెళ్లి తలదాచుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.