NGKL: బల్మూర్ మండల పరిధిలోని వీరాంరాజుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా బీఆర్ఎస్ మద్దతుదారు పానుగంటి మనోహర్ విజయం సాధించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి చంద్రశేఖర్ రెడ్డిపై 10 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనోహర్ పేర్కొన్నారు.