SKLM: పాతపట్నం నీలమణి దుర్గమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.5,16,644 లక్షల వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారి. వాసుదేవరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్కలి ఈవో టీ.పీ. మనస్వి పర్యవేక్షణలో 47 రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. పాతపట్నంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.70,053 వచ్చిందని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.