హైదరాబాద్ మహానగరంలోని సాలార్జంగ్ మ్యూజియంలో ప్రారంభమైన ఫౌండర్స్ గ్యాలరీ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అరుదైన చేతిరాతలు, కాలిగ్రాఫిక్ రచనలు కలిగిన గొప్ప లైబ్రరీతో పాటు మూడు తరాలకు చెందిన విలువైన వస్తువులను ఇక్కడ ప్రదర్శించారు. కళాత్మక చిత్రాలు, ఆయిల్ పెయింటింగ్స్, వ్యక్తిగత వస్తువులు, కుటుంబ జీవనశైలిని ప్రతిబింబించే అంశాలు ఉన్నాయి.