కృష్ణా: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను NH-16గా మార్చే ప్రతిపాదనకు మోర్త్ సానుకూలంగా స్పందించింది. ఎంపీ కేశినేని చిన్ని సూచనల మేరకు చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 32K.MS మేర రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో బైపాస్ వెంట ఉన్న గ్రామాలు, MSME యూనిట్లకు అనుసంధానం సులభం కానుంది.