VZM: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వులు మేరకు 100 రోజుల క్యాంపెయిన్లో భాగంగా ఆయన విజయనగరం మండలం గాజులరేగ గ్రామంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.