KDP: చెన్నూరు మండలం శివాలపల్లికి చెందిన హేమ వర్షిత కర్రసాము పోటీల్లో సత్తాచాటి జాతీయ స్థాయికి ఎంపికైంది. గుంటూరులో జరిగిన రాష్ట్ర పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆమె… జనవరి 21 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటుందని తల్లిదండ్రులు సుబ్బారాయుడు, ఈశ్వరమ్మ తెలిపారు. కోచ్ జయచంద్ర వల్లే ఈ ఘనత సాధ్యమైందని కృతజ్ఞతలు చెప్పారు.