ADB: బోథ్ మండల కేంద్రంలో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఇవాళ బోథ్ పట్టణ పురవీధుల గుండా స్పెషల్ పార్టీ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రేపటి పంచాయతీ ఎన్నికలకు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగడానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.