NLG: గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణం ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని జోన్-VI డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ అన్నారు. దేవరకొండలో మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అధికారులు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.