MBNR: హన్వాడ మండలంలోని అత్యకుంట తాండా గ్రామ సర్పంచ్ జర్పుల లక్ష్మణ్, టంకర గ్రామ సర్పంచ్ మెండె లక్ష్మి అచ్చెన్నలు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.