AP: పోలీస్ నియామకాలపై 31 కేసులు వేశారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో కానిస్టేబుల్ నియామకపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘చిక్కులన్నీ అధిగమించి 23 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేశాం. కూటమి ఉంటేనే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు.. వేరేవాళ్లు వస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి. మొత్తం 4.51 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం’ అని పేర్కొన్నారు.