SKLM: ఆమదాలవలస మండలం అక్కివరం పంచాయతీ పరిధిలోని కొత్త రోడ్డు ప్రాంతంలో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవాళ సాయంత్రం పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.