KMM: మగ సంతానం లేకపోవడంతో, తండ్రి చివరి కోరిక మేరకు సాంప్రదాయానికి భిన్నంగా కుమార్తెనే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన సత్తుపల్లిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓరుగు పుల్లయ్య(75) వయోభారం, అనారోగ్యంతో మృతి చెందారు. కొడుకే కర్మకాండలు నిర్వహించాలనే సాంప్రదాయాన్ని పక్కనపెట్టి, ఆయన పెద్ద కుమార్తె దుబ్బల కృష్ణవేణి కన్నీటితో తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసింది.