కేరళలోని పత్తినంతిట్ట ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.