రామ జన్మభూమి ఉద్యమ నేత, BJP మాజీ MP రామ్ విలాస్ వేదాంతి(67) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మధ్య ప్రదేశ్లోని ఆస్పత్రిలో గుండెపోటుతో నిన్న మరణించారు. వేదాంతి అంత్యక్రియలు ఇవాళ అయోధ్యలో జరగనున్నాయి. ఆయన తన జీవితాన్ని అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2సార్లు MPగా గెలిచారు.