KNR: కరీంనగర్ ఎస్సార్ఆర్ ప్రభుత్వ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం డాక్టర్ పడాల తిరుపతి రచించిన నూతన పాఠ్యపుస్తకాన్ని కడారు సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఎస్సీ (బోటనీ) మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ‘నాలిక కణజాల రహిత మొక్కలు’ శీర్షికతో ఈ పుస్తకాన్ని కొత్త విద్యా విధానం ప్రకారం రూపొందించారు.