W.G: వీరవాసరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ముద్దాడ గణేశ్ భవాని యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఎంపికైన రొంగల కృష్ణవేణికి నియామక పత్రాలు అందజేశారు. జనగణనలో కులగణన పారదర్శకంగా చేపట్టాలని, కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు.