NLG: కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యలు డిమాండ్ చేశారు. నల్గొండలోని బేవరేజెస్ గోదాం వద్ద కార్మికులతో శనివారం వారు నల్లబ్యాడ్జీల ధరించి ఆందోళన చేపట్టారు. కార్పొరేట్ వర్గాలకు కేంద్రం వత్తాసు పలుకుతుందని ఆరోపించారు.