BHNG: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రామన్నపేట మండలం వెల్లంకి, సిరిపురం, బోగారం, నీర్నేముల గ్రామాల్లో 72 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. మార్కెట్ వైస్ ఛైర్మన్ మల్లారెడ్డి, ప్యాక్స్ ఛైర్మన్ బిక్షం రెడ్డి పాల్గొన్నారు.