NZB: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు Dr. శ్రీను నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు కంఠేశ్వర్లోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. 30 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసు ఉన్న మహిళలు, పురుషులు ఇందులో పాల్గొనేందుకు అర్హులన్నారు.