AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామ పంచాయతీల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్ 2, మున్సిపల్ మార్చి 17తో ముగియనుంది. ఇక MPTC, ZPTC ఎన్నికల గడువు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ముగియనుంది. అయితే, వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స ఉంది.