SKLM: సంతబొమ్మాళిలో వేంచేసియున్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం నుంచి భద్రాచలంలో ఉన్న సీతారామ లక్ష్మణ ఆలయంవరకు కాలినడకన శనివారం భక్తులు బయలుదేరారు. గత 41 రోజులుగా హనుమాన్ మాలాధారణలో దీక్ష కొనసాగించారు. భద్రాచలంలో దర్శనం అనంతరం మాలవిసర్జన కార్యక్రమం నిర్వహించినట్లు గురుస్వామి పప్పు రాజు తెలియజేశారు. జైశ్రీరాం జైహనుమాన్ అంటూ పాదయాత్రచేస్తూ వెళుతున్నట్లు తెలిపారు.