దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) గత కొన్ని రోజులుగా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే స్థాయిలో వాతావరణం కలుషితమైంది. నగరంలో గాలి నాణ్యత సూచీ(AQI) సగటున 360 పాయింట్లుగా నమోదైంది. 301 నుంచి 400 మధ్య AQI ఉంటే దాన్ని ‘చాలా దారుణం’ (Very Poor)గా పరిగణిస్తారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.