తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి ప్రాజెక్టుపై నయా న్యూస్ బయటకువచ్చింది. దర్శకుడు RJ బాలాజీ డైరెక్షన్లో రజినీ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు బాలాజీ మంచి కథను సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, రజినీ.. కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.