రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో జరిగిన ఓ సభలో ప్రసంగించిన ఆయన, ‘హిందువులు లేకుండా ప్రపంచానికి ఉనికి ఉండదు’ అని వ్యాఖ్యానించారు. దేశ సంస్కృతి, ఉనికిలో హిందువుల పాత్రను నొక్కి చెప్పడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లోని ప్రస్తుత పరిస్థితులపై కూడా భగవత్ చర్చించారు.